ప్రియమైన స్నేహితుడి కి
కిషన్ ....డైలీ వుదయం ఆఫీసు కి రాగానే ఎంతో ఆత్రుతగా జిమెయిల్ ఓపెన్ చేస్తాను ...నా మిత్రుడి నుండి ఏమైనా మెయిల్ వచ్చాయా అని ...కాని మెయిల్ బాక్స్ నిన్న చూసిన మెయిల్స్ తప్ప కొత్తవి చూపించదు. సర్లే అని ఆఫీసు పని లో మునిగి పోతాను ...లుచ్ టైం అవుతుంది...మల్లి ఒకసారి మెయిల్స్ చెక్ ....ఊహు ..నో న్యూ మెయిల్స్...ఓకే అని ఇంటికి వెళ్లి ఇంత...(?)తినేసి వస్తాను..రాగానే మల్లి మెయిల్స్ చెక్....పాపం ఇప్పుడు జిమెయిల్ కే నామీద జాలి పుట్టి రెండు స్పాం మెయిల్స్ ని పంపిస్తుంది..కాని నా మిత్రుడి మెయిల్ రాదు..మల్లి ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా సేం ప్రాసెస్ . బట్ నో మెయిల్స్.....
అందుకే ....ఆలోచించాను .....తప్పు నాదే ...నేను నీకు మెయిల్స్ పంపకుండా నీ మెయిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను.
ఇప్పుడు మెయిల్ చేస్తున్నాను...నువ్వు దీనికి రిప్లై పంపగలవు...తప్పని సరిగా...ఎందుకంటే మనం గోదావరిఖని లో వుండి కలుసు కోలేని రోజు లేదు...దైవ నిర్ణయమో లేక నేను పెద్దగ చదువు కొకపోవడమో నేను తమిళనాడులో నువ్వు హైదరాబాద్ లో వున్నాం ...సంవత్సరాని కి ఒకసారి కూడా కలుసుకుంటమో లేదో తెలియదు.
అందుకే మిత్రమా....డైలీ ఒక మెయిల్ చెయ్యి....ఇక నుండి నేను కూడా మెయిల్స్ చేస్తాను....
ఇట్లు
నీ స్నేహితుడు
Tuesday, February 10, 2009
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
:) nice
బాగుంది...మీరు మెయిల్స్ చూసుకోవడంలో బిజీ అయిపోకండి మరి!!!
Post a Comment