విజ్జు గాడు: వీడితో ఒక్కరోజు కలిసి తిరిగితే చాలు....వాడి గురించి ఎం అనిపిస్తుందంటే...''వీడికి వున్న తెలివికి వీడు ఇక్కడ వుండకూడదు.....అమెరికాలో హాలివుడ్ కి స్టైల్స్ నేర్పే జాబు లో వుండాలి అనిపిస్తుంది.. ''
అలాగే అయిదు నెలలు స్నేహం చేసాం అనుకో ''వీడు ఇక్కడ వున్నది కరక్టే '' అనిపిస్తుంది...
వీడు మొలతాడు కి బదులుగా లీ కూపర్ షూ లేస్ కట్టుకుంటాడు ..బ్రాండెడ్ అంటే అంత మోజు వీడికి...
మొత్తానికి వీడు మా గ్రూప్ లో గ్రాఫిక్స్ లాంటి వాడు. (గ్రాఫిక్స్ వున్న అంజి ఫ్లాప్ అరుందతి హిట్).
వీడే గనక ముకేష్ అంబాని తో కలిసి వుంటే అతడు ఫోర్బ్స్ పత్రిక(ప్రపంచ సంపన్నుల జాబితా) లో కాదు కదా..కోల్ వాయిస్ పేపర్ లో కూడా రాదు..
వీడు ఒంటరిగా ఈ సింగపురో లేక మలేసియా నో వెళితే వీడికి మంచిది వీడి స్నేహితులకి ఇంక మంచిది. (ఎందుకంటే అక్కడి నుండి ఎప్పుడైనా వచ్చేటప్పుడు పర్సులు, ఇంక మంచి మంచి ఐటమ్స్ తీస్కోస్తడు కదా...వీడు డ్రెస్సులు, బెల్టులు ,పర్సులు, మొదలైనవి సెలెక్ట్ చెయ్యడం లో నెంబర్ వన్).
ఒక్కమాటలో చెప్పలేం..
కిషన్ గాడు: వీడిని ఏమైనా అంటే కళ్లు పోతాయో లేదో తెలియదు కాని పోయిన కళ్లు ఎన్ని మందులేసిన తిరిగి రావు...
అంత మంచి వాడు....వీడితో స్నేహం చేస్తే వీడి ఫాన్స్ అయిపోతారు...ఆటోమాటిగ్గా...
మొహమాటస్తుడు, ఏమనుకుంటారో అని అనుకునేవాడు, (ఎవరైనా సీరియల్సు చూసే టైం లో వాళ్ళింటికి వీడు వెళ్తే సీరియల్ అయిపోయే దాక ప్రకటనల తో సహా చూసి చప్పట్లు కొట్టి ఈ సీరియల్ దేశానికీ మంచిది మీరు మంచి సీరియల్ చూస్తున్నారు అని చెప్పి బయటకి వచ్చి ఎవ్వరు చూడకుండా కొంచం సేపు కుమిలి కుమిలి పోతాడు కాని ''చెత్త సీరియల్సు వేరే చానల్సు మార్చండి'' అని అనడు..)
ఒక్క మాటలో చెప్పాలంటే వీడు'' సన్నిహిత ప్రియ మిత్రుడు''
బచ్చి గాడు: ''హి హి హి'' అని నవ్వుతాడు ...ఆ నవ్వు ఒక్కటి చాలు .....
కిషన్ కి పెద్ద ఫ్యాను....
కిషన్ తలమీద వెంట్రుకలు కదిలినా చాల ఫీల్ అవుతాడు కాని వీడి గాలి వలనే ఆ వెంట్రుకలు కదులుతున్నాయని అర్థం చేసుకోడు.
ఒక్క మాటలో చెప్పాలంటే'' చిన్న పిలగాడు''
(ఇంక వుంది)
Tuesday, February 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
''హి హి హి'' .....
మీ విజ్జు, photography smart విజ్జు ఒక్కరేనా?
కాదండి రాణి గారు..
Post a Comment