Monday, August 24, 2009

బాల్లీ సాగూ గారి ఒక గ్రేట్ సాంగ్ చూడండి

నా చిన్నప్పుడు నాకు బాగా నచ్చిన పాట ఇది ...

Thursday, August 13, 2009

ఒక హిట్ తమిళ్ సాంగ్

నాకు నచ్చిన ఒక తమిళ్ పాట ..మీరు కూడా చూడండి.


చిత్రం పేరు: ముదల్ మరియాదై (మొదటి మర్యాద)
దర్శకుడు: భారతి రాజా
సంగీతం: ఇళయరాజా

Friday, August 7, 2009

మిత్రుని జన్మ దినోత్సవం....

ప్రియాతి ప్రియమైన బ్లాగర్లందరికీ (రాసే వారికి , వాటిని చూసేవారికి)వందనాలు.

ముఖ్యముగా....

రేపు అనగా ఆగష్టు ఎనిమిదవ తేదీ మా కిషన్ గాడి బర్త్డే ( క్రియేటివిటి). అవును మరి గొప్ప వాళ్ళెప్పుడు ఆగష్టు లోనో లేదా ఫిబ్రవరి లో నో పుడుతుంటారు....

వాడు చాలా మంచి వాడు. ఫ్రిఎన్ద్శిప్ (మళ్ళి క్రియేటివిటి) కి కాషాయ దుస్తులు తొడిగి ''టై ''కడితే వాడు మన కిషన్ గాడే...

ఈ రోజు వాడు నాకు కరెక్ట్ గ 12:34:56 కి ఫోన్ చేసాడు . గమనించారా...ఈ రోజు 7 వ తేదీ, ఇది 8 వ నెల ,9 వ సంవత్సరం.(2009) ....
అంటే 1 నుండి 9 వరకి గల అంకెలు అన్ని వున్నాయన్న మాట ....

మా ఇద్దరి ఫ్రిఎన్ద్శిప్ (**) గురించి కొంచం....

వాడికి టీ అంటే ఇష్టం...నాకు కాఫీ అంటే ఇష్టం...
వాడికి షారుక్ అంటే ఇష్టం ....నాకు నానా పటేకర్ అంటే ఇష్టం...
వాడు ఆంధ్రప్రదేశ్ లో వున్నాడు....నేను తమిళనాడులో...
వాడిది హీరో హోండా బండి.......నాది టి.వి.ఎస్. ...
వాడిది లవ్ మారేజ్ .....నాది ..అరేంజ్ మారేజ్..వా....( ఏడుపు)...అంతలోనే హ.హ...(నవ్వు)

ఎందుకంటే నన్ను వేటాడి వెంటాడి పట్టుకుని జైలు లో తోసేసారు....వాడు లొంగిపోయాడు ....ఇద్దరం సంసారం అనే ఓపెన్ జైలు లో నే వున్నాం...

ఆయినా సరే మేమిద్దరం ప్రాణ స్నేహితులం....

ఎందుకంటే .......

మా మధ్య చిన్నప్పుడు జరిగిన ఒక ఒప్పందం మా ఇద్దరిలో ఎవరు ఎం చేసిన ఇంకొకడు దానికి సపోర్ట్ చెయ్యాలి..(లోకం లో తప్పులు , ఒప్పులు అనేవి లేవు, సమయం , సంధర్బం మనుషులు, వారి గుణాలు , పరిసరాలు బట్టి అవి నిర్ధారించ బడతాయి కాబట్టి మనం ఎం చేసిన అది కరెక్ట్ అని వాదించవచ్చు కాక పోతే కొంచం తెలివి తప్పని సరి. )

నా కోసం వాడు ఏమైనా చెయ్యగలడు....నేను కూడా వాడి కోసం ఏమైనా చెయ్యగలను....(ఒక్క మార్తాండ గారి తో ''వేసిన ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పించడం '' తప్ప.. )

కాబట్టి మీరు నా స్నేహితునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగలరు....

మీకు నా ముందస్తు కృతజ్ఞతలు ....