Friday, February 27, 2009

నా స్నేహితులు : పార్టు మూడు

ముస్తఫా: మా శ్రీను గాడి ప్రేమ వలన మాకేమైనా లాభం వుందా అన్న ప్రశ్నకు జవాబు ఈ ముస్తఫా.
ఆ అమ్మాయి ఇంటి పక్కనే వీళ్ళ ఇల్లు అందుకే ఇతడిని మా గ్రూప్ లో దోస్తు చేసుకున్నాము. కాని ఇతడి కొన్ని మంచి గుణాలు(చెస్ ఆడడం క్రికెట్ ఆడడం) చూసినతరువాత నిజంగానే మా శాశ్వత దోస్తాన్ టీం లో చోటు కల్పించాం.
మా ఇద్దరి మధ్య మంచి స్నేహం వుంది కాని ఒక లోటు ఏంటంటే ''అరేయ్ ఒరేయ్ ''అనేంత స్నేహం లేదు.ఎందుకంటే మా అందరిలో మొదట ఇతడు అంటేనే పడక పోయేది ఆ అమ్మాయి ని రోజు చూడడం కోసం శ్రీను గాడు కోసం ఇతడిని దోస్తుగా చేసాడు అని మాలో ఫీలింగ్ వుండేది. తరువాత ఆ ఫీలింగ్ పోయింది కాని మా దోస్తాన్ లో ఈ లోటు మిగిలి పోయింది.

కాని ఆ అమ్మాయి పెళ్లి అయిపోయిన తరువాత శ్రీనుగాడికి మనసు మార్చడానికి ఇతడు చెప్పిన మాటలు రాజకీయంగా మాకు ఎంతగానో తోడ్పడ్డాయి.

ఏం లేదండి ఇతడు వేరేఅమ్మయిని ప్రేమించమని సలహా ఇచ్చాడు మా శ్రీను గాడికి వాడు వీరలెవల్లో ఒకమ్మాయికి లైన్ వేసి పడేసి ఒక సందులో మాట్లాడుతుండగా ఆ అమ్మాయి వాళ్ల బాబాయి చూడడం ఆ అమ్మాయి చేతే ఈవ్ టీజింగు కేసు పెట్టించడం పోలిసులు మనవాళ్ళని (నేను అప్పుడు అక్కడ లేను హైదరాబాద్ లో వున్నాను)లోపల వెయ్యడం వాళ్లు బెయిల్ పై బయటికి వచ్చి కోర్టులకి పోలీస్ స్టేషన్ లకి తిరగడం అప్పుడే ఎలెక్షన్ లు రావడం కొంత మంది రాజకీయనాయకులు వచ్చి వీళ్ళే రేపటి పౌరులు అని వీళ్ళని ఓట్లు వేయించమని అడగడం మనవాళ్ళ స్టేటస్ పెరిగి పోవడం చక చక చక జరిగి పోయాయి.

ఇంకా వుంది....

No comments: