Thursday, February 26, 2009

నా స్నేహితులు: పార్టు రెండు

శ్రీను గాడు: వీడిని పదవ తరగతి చదివేటప్పుడు ముద్దుగా ''మేక'' అని పిలిచేవారు...
కాని సుస్వాగతం సినిమా రాగానే వీడు పవన్ కళ్యాణ్ అయి పోయాడు..
ఫోర్ ఇయర్స్ లవ్ స్టొరీ వీడిది..ఎదవ తరగతి సారి... ఏడవ తరగతి చదివే రోజులనుండి ఇంటర్ ఫస్టియర్ వరకి ఒకే అమ్మాయిని ప్రేమించాడు...(షరా మాములుగా ఆ అమ్మాయికి వేరే అతని తో పెళ్లి అయి పోయింది).
ఒక సారి దైర్యం చేసి ప్రేమ విషయం చెబుదామని అనుకున్నాడు...అందుకు ఒక గ్రీటింగ్ కార్డు కూడా కొన్నాడు.వారం అయింది , రెండు వారాలు అయ్యాయి కాని వీడు గ్రీటింగ్ కార్డు ఇవ్వట్లేదు ''ఎందుకు రా లేట్'' అని అడిగాము.
ఏప్రిల్ ఫస్ట్ కోసం ఎదురు చూస్తున్న అని అన్నాడు మాకు అర్థం అయింది వాడి దైర్యం ..అయినా
డైలీ ఆ అమ్మాయి వుండే ఇంటి సందులో కి ఇరవై ముప్పై సార్లు చక్కర్లు కొట్టేవాడు..(కూడా మమ్మల్ని తీసుకు వెళ్ళేవాడు. ఊరికే కాదు లెండి ''మార్కండేయ స్వీట్ హౌస్ లో సమోసా''కొనిచ్చేవాడు)
ఆ స్వీట్ హౌస్ కి ఎప్పుడైనా సెలవు వున్నప్పుడు వీడిని తప్పించుకు తిరిగేవాళ్ళం.
అలా ఆ సందు చాల బిజీ గా వుండేది. ఆ సందు లో మా సైకిళ్లు తోక్కడాలు, నడవడాలు మూలాన గోతులు ఎక్కువ అయి ఆ సందులో వున్నా వాళ్లందరూ గోల పెట్టారు.
వెంటనే ఆ అమ్మాయి పెళ్లి అయిపొయింది..
మన వాడి ఇంట్లో బీరువాలో ఆమె తో ఆడిన షటిల్ కాక్, దసరా కి ఆమె ఇచ్చిన సత్తు పిండి మిగిలి పోయాయి.
(అంతటి తో అయిపోలేదు కొందరు మిత్రుల సలహా పై ''ఈ కాలం లో రాముడి లా వుండకూడదు కృష్ణుడి లా వుండాలి '' అని మనవాడు వేరే అమ్మాయి లైన్ వేసాడు కాని ....ప్రేమ సంగతి దేవుడెరుగు మా గ్రూప్ గోదావరిఖని లో రౌడి శిటర్లు అయ్యారు )

No comments: